సుష్మాస్వరాజ్ న్యూయార్క్ చేరుకున్నారు..
- September 25, 2016
కేంద్ర విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ఇవాళ ఉదయం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 71 సమావేశాల్లో ప్రసంగించేందుకు ఆమె ఇక్కడికి చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం ఆమె ప్రసంగించనున్నారు. భారత అంతర్గత అంశమైన కశ్మీర్‌పై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఆమె ఈ సమావేశాల్లో గట్టి సమాధానం ఇవ్వనున్నారని భావిస్తున్నారు. ఉగ్రవాదంతోపాటు, భద్రతా సమితి విస్తరణ, వాతావరణ మార్పులు, ప్రపంచ శాంతి వంటి అంశాలపై కూడా సుష్మాస్వరాజ్ దృష్టి పెట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్‌స్వరూప్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సుష్మాస్వరాజ్ ఏం మాట్లాడుతుందోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందని ఆయన పేర్కొన్నారు.సుష్మాస్వరాజ్ ప్రసంగపాఠం వివరాలను ఆయన బయటపెట్టలేదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







