ఒమనైజేషన్ వేగవంతం - ప్రవాసీయుల ఉద్యోగాలకు ఎసరు!

- August 11, 2015 , by Maagulf
ఒమనైజేషన్ వేగవంతం - ప్రవాసీయుల ఉద్యోగాలకు ఎసరు!

వేలమంది ఒమాన్ నిరుద్యోగ పౌరులకు ఉపాధి కల్పించడానికి తలపెట్టిన ఒమనైజేషన్ పధకాన్ని ప్రభుత్వం వేగవంతం చేయడంతో, అక్కడ ప్రవాస శ్రామికులు,ఉద్యోగులు తమ ఉపాధి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రతిసంవత్సరం 12,000 మందికి పైగా ఒమాన్ యువత స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలనుంది ఉద్యోగవేట కోసం బయటపడుతుండగా, గతంలో వారు ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే మొగ్గుచూపేవారు. ఐతే ఇపుడు,  ప్రభుత్వం ఈ సంవత్సరం మరియు 2016లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిలిపివేయడంతో,వారిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలను పొందుతున్న నేపధ్యంలో వారిచూపు ప్రైవేటు రంగంపై పడింది. ఇపుడు ప్రవాసీయుల ఉద్యోగభద్రత అనేది గాలిలో దీపంగా మిగిలింది!


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com