కేరళ క్యాబేజి

- September 25, 2016 , by Maagulf
కేరళ క్యాబేజి

కావలసినవి: రెండు కప్పుల కాబేజి (సన్నగా తరిగి), అర టీస్పూను ఆవాలు, ఒక టేబుల్‌స్పూను నూనె, రెండు టేబుల్‌స్పూన్ల మినపప్పు (నానపెట్టి), రెండు టేబుల్‌స్పూన్ల తాజా కొబ్బరి (తురిమి), అర టీస్పూను మిరియాల పొడి, కరివేపాకులు 8 లేదా 10, ఒక టీస్పూను పచ్చిమిరపకాయ (తరిగి), ఒక ఎండు మిరపకాయలు (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని), ఉప్పు తగినంత, కొత్తిమీర (సన్నగా తరిగి), టొమాటొ ముక్కలు.

ఎలా చేయాలి: పాన్‌లో నూనెను వేడిచేసి ఆవాలు, కరివేపాకులు, ఎండు మిరప ముక్కలు వేయాలి. వీటిని చిటపటమనే వరకు వేగించి మినపప్పు వేయాలి. కొన్ని నిముషాల తరువాత కాబేజి, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిరియాల పొడి వేయాలి. బాగా కలిపి మూతపెట్టి సన్నని సెగమీద సగం ఉడికే వరకు ఉంచాలి. తరువాత తురిమిన కొబ్బరిని కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. ఫోటోలో చూపినట్టు క్యాబేజీ పైపొరలనే పాత్రగా మలిచి ఈ కూరను అందులో కూరి పెడితే చూడ్డానికి ఇంకా బాగుంటుంది. పైన కొత్తిమీర, టొమాటొ ముక్కలు అలంకరించి తింటే భలే రుచిగా ఉంటుం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com