చైనాలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ప్రారంభం.....
- September 25, 2016
చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఆదివారం నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది. వందల కోట్ల డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుతో పాటు ఈ నెలారంభంలో రోదసిలో రెండో అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 500 మీటర్ల వ్యాసం కలిగిన ఈ రేడియో టెలిస్కోప్‌ను చైనా దక్షిణ ప్రాంతంలోని గిజౌ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ టెలిస్కోప్ తారలు, రోదసిలో సంచరిస్తున్న ఇతర గ్రహాలు, గ్రహాంతర జీవుల నుండి వచ్చే సంకేతాలను సేకరించి పరిశోధకులకు అందచేస్తుంది. ఈ 500 మీటర్ల అపెర్చర్ స్ఫెరికల్ టెలిస్కోప్ (ఫాస్ట్) ప్రారంభ కార్యక్రమాన్ని వందలాది మంది ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు తిలకించారని సిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.దాదాపు 18 కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఐదేళ్లు పట్టింది. ఇప్పటి వరకూ ప్రపంచంలో అతిపెద్ద రేడియోటెలిస్కోప్గా రికార్డుల కెక్కిన పోర్టారికోలోని అరెసిబో ప్రయోగశాలలో వున్న 300 మీటర్ల టెలిస్కోప్ రికార్డులను ఫాస్ట్ అధిగమించింది. భూమ్యాకర్షక రేడియో తరంగాలతో పాటు తారాలోకం, పాలపుంతల వంటి వాటి నుండి వచ్చే రేడియో తరంగాలను కూడా ఇది ఆకర్షిస్తుందని శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ సిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









