ఐఎస్ వ్యతిరేకంగా జోర్డాన్ పోరాడుతోంది...
- September 25, 2016
జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని అబిదలీ జిల్లా కోర్టు అవరణలో ఓ రచయిత హత్యకు గురయ్యారు. జోర్డాన్‌కి చెందిన రచయిత నహేద్ అత్తార్ ఆగస్టు 13న ఫేస్ బుక్‌లో ఓ కార్టూన్ పోస్టు చేశారు. అది ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ కేసు నమోద చేసి నహేద్ను అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలులో ఉన్న నహేద్ సెప్టెంబరు మొదటి వారంలో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత ఆయన ఆ కార్టూన్‌ను ఫేస్ బుక్ నుంచి తొలగించారు. ఆ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నహేద్ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చిచంపాడు. అతడి శరీరంలోకి మూడు బులెట్లు దూసుకుపోయాయి. హత్యకు గురైన నహేద్ క్రైస్తవుడు. జోర్డాన్ ప్రభుత్వం నహేద్ కేసు విషయమై మీడియా మీద అంక్షలు విధించింది.అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలతో కలిసి ఐఎస్ వ్యతిరేకంగా జోర్డాన్ పోరాడుతోంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







