హీరో అల్లరి నరేష్‌ తండ్రి అయ్యాడు...

- September 28, 2016 , by Maagulf
హీరో అల్లరి నరేష్‌ తండ్రి అయ్యాడు...

హీరో అల్లరి నరేష్‌ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఆనందం వ్యక్తం చేశారు. అందమైన పాపాయికి తండ్రయిన అదృష్టవంతుడిని.. చాలా సంతోషంగా ఉందని పోస్ట్‌ చేశారు. దీంతోపాటు పాపతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దాంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.గత ఏడాది మే లో అల్లరి నరేష్‌.. విరూప కంఠమనేనిని వివాహం చేసుకున్నారు. ఆమె వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్‌. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన 'సెల్ఫీరాజా' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేశ్‌ ప్రస్తుతం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రంలో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com