అరబ్‌ దేశాలలో తొలి భారతీయ అధ్యాయన పీఠం

- September 28, 2016 , by Maagulf
అరబ్‌ దేశాలలో తొలి భారతీయ అధ్యాయన పీఠం

అరబ్‌ దేశాలలో తొలి భారతీయ అధ్యాయన పీఠాన్ని ఈజిప్టులోని ప్రఖ్యాత ఐన్‌ షామ్స్‌ యూనివర్సిటీలో గతవారం(ఏఎస్‌యూ) ఏర్పాటు చేశారు. భారత సాంస్కృతి సంబంధాల శాఖ(ఐసీసీఆర్), యూనివర్సిటీ మధ్య ఈ ఏడాది కుదిరిన ఒప్పందం మేరకు ఈ పీఠాన్ని నెలకొల్పారు.

భారత్‌-ఈజిప్ట్‌ల మధ్య పౌర సంబంధాలు ఉన్నప్పటికీ, విద్యారంగంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు చాలా పరిమితంగా ఉన్నాయని పీఠం ప్రారంభ సభలో భారత రాయబారి సంజయ్‌ భట్టాచార్య అన్నారు. మూడేళ్లు పనిచేసే ఈ పీఠాన్ని పరస్పర అంగీకారంతో పొడిగించుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com