చైనాను మెగీ తుపాను ముంచెత్తుతోంది..
- September 28, 2016
చైనాను మెగీ తుపాను ముంచెత్తుతోంది. రెండు రోజుల పాటు తైవాన్ను వణికించిన మెగీ తుపాను బుధవారం చైనాకు మళ్లింది. తుపాను కారణంగా జీజాంగ్ ప్రావిన్స్‌లోని సుకున్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 32 మంది గల్లంతయ్యారు. గ్రామంలోని ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. సహాయక బృందాలు ఇప్పటివరకు 15 మందిని కాపాడాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. రెండ్రోజుల పాటు ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నెలలో చైనాలో బీభత్సం సృష్టించిన మెరంటి టైఫూన్ కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







