అక్టోబర్ 6న 'జాగ్వార్' విడుదల...
- September 28, 2016
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్'. హెచ్.డి.కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జాగ్వార్'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
నిఖిల్‌కుమార్, దీప్తి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యమీనన్, భజ్రంగ్ లోకేష్, అవినాష్, వినాయక్ జోషి, ప్రశాంత్, సుప్రీత్ రెడ్డి, రావు రమేష్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: హెచ్.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, మ్యూజిక్: యస్.యస్. థమన్, ఆర్ట్: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్: రవివర్మ, రామ్-లక్ష్మణ్, కలోయాన్ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







