బాహుబలి చిత్రయూనిట్ మీడియా సమావేశం..
- September 29, 2016
సౌత్ సినిమా రూపు రేఖలు మార్చేసిన భారీ చిత్రం బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ కు ప్రస్తుతం సీక్వల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ఆఖరి దశకు చేరుకోగా, ఈ శుక్రవారం చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులంతా పాల్గొంటారు.షూటింగ్ అప్ డేట్స్ తో పాటు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ల రిలీజ్ డేట్ లపై ఈ ప్రెస్ మీట్ లోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అంటూ ప్రకటించిన యూనిట్ సభ్యులు, అందుకు తగ్గట్టుగా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.తొలి భాగం కన్నా ఎక్కువ బడ్జెట్ తో మరింత ఉన్నతమైన గ్రాఫిక్స్ తో బాహుబలి పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నారు
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







