సౌదీ అరేబియాలో 102 మహిళా న్యాయవాదులు
- September 29, 2016
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్ తాజాగా వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం ఏడాది కాలంలో అత్యధికంగా లా ప్రాక్టీస్ కోసం లైసెన్సులు మంజూరు చేసినట్లు వెల్లడయ్యింది. 1437 హిజ్రి ఇయర్లో మినిస్ట్రీ 512 లైసెన్సుల్ని జారీ చేయగా 39 మహిళా న్యాయవాదులకు జారీ చేసిన లైసెన్సులు ఉన్నాయి. కింగ్డమ్లో మొత్తం 3,844 మంది లైసెన్స్ గల న్యాయవాదులు ఉండగా, అందులో 102 మంది మహిళా న్యాయవాదులున్నారు. సౌదీ అరేబియా చట్టం ప్రకారం జనాభాకి తగిన నిష్పత్తిలో న్యాయవాదుల సంఖ్య ఉంది. జనరల్ అథారిటీ లెక్కల ప్రకారం సౌదీ అరేబియా జనాభా 31,015,999. ప్రతి 8069 మందికీ ఓ న్యాయవాది ఉన్నారిప్పుడు. అయితే పురుష లాయర్లతో పోల్చితే మహిళా న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తొలిసారిగా ఓ మహిళా న్యాయవాది లైసెన్సు పొంది, కార్యాలయాన్ని ప్రారంభించడం 2014లో జరిగింది. లైసెన్స్ పొంది న్యాయవాది కాఆ్యలయంలో అది కూడా సౌదీ అరేబియాలో మూడేళ్ళపాటు శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ మాత్రమే కొత్తగా లైసెన్స్ పొందేందుకు అర్హులవుతారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







