అబూధాబీ లో 3 పాఠశాల బస్సుల ప్రమాదంలో 47 మందికి గాయాలు

- September 29, 2016 , by Maagulf
అబూధాబీ లో  3  పాఠశాల బస్సుల  ప్రమాదంలో  47 మందికి గాయాలు

అబూ ధాబీ:  గురువారం ఉదయం జరిగిన మూడు బస్సుల ప్రమాదంలో 47 మంది  పాఠశాల పిల్లలు గాయపదినట్లు  అబూధాబీ పోలీసులు తెలిపారు, ఈ  రోడ్డు ప్రమాదంలో మూడు బస్సుల జోక్యం ఉన్నట్లు  పేర్కొన్నారు.   
రెండు బస్సులలో పాఠశాల పిల్లలను రవాణా చేస్తుండగా   మూడవధీ  ఒక ప్రజా రవాణా చేసే షటిల్ సర్వీస్ బస్సు ఈ ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు, వారిని  ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు. వారు ప్రస్తుతం స్థిరమైన స్థితిలో ఉన్నారు. వారు మఫ్రాక్  ప్రజా సౌకర్యం ఆసుపత్రి లో  ఉన్న వీరు పాటశాల విద్యార్థులు  కావడంతో వారిని వెంటనే పంపించలేదు. మరో 20 మందికి ఒక మోస్తరు గాయాలతో బయటపడ్డారు చికిత్స పొందిన తరువాత వారిని ఆసుపత్రి నుంచి  డిస్చార్జ్ చేయబడతారని పోలీసులు తెలిపారు. ఖలీజ్ అల్ ముస్లిం విద్యా కేంద్రం అరబీ వీధి వద్ద  రాజధాని నుండి అవుట్బౌండ్ దిశలో ముస్సాఫ్ఫాహ్  వంతెన తర్వాత ఈ ప్రమాదం ఏర్పడింది. ఈ రహదారిని  ఉదయం  7:30 గంటల మరియు 9 గంటల మధ్య సమయంలో మూసివేయడం జరిగింది,  ట్రాఫిక్ ఆలస్యంగా ప్రారంభమై మధ్యాహ్నం వేళలో తిరిగి పుంజుకొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com