ఎంఎఆర్ వ్యాక్సినేషన్: 294,000 చిన్నారుల టార్గెట్
- September 29, 2016
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంఓపిహెచ్), జాతీయ స్థాయిలో ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్‌ని మీజిల్స్, మంప్స్ మరియు రుబెల్లాకి వ్యతిరేకంగా చేపట్టింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే ఈ క్యాంపెయిన్‌లో మొత్తం 294,000 మంది చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, హమాద్ మెడికల్ కార్పొరేషన్, ఖతార్ పెట్రోలియం, సిడ్రా మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సంయుక్తంగా ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తున్నాయి. ఏడాది నుంచి 13 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్‌ని ఇవ్వనున్నారు. 2020 నాటికీ వ్యాధుల్ని ఖతార్ నుంచి తరిమికొట్టేలా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్ట్రాటజీని రూపొందించింది. మొత్తం 12 హెల్త్ సెంటర్స్‌ని వ్యాక్సినేషన్ కోసం గుర్తించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో దేశంలో మీజిల్స్, మంప్స్, రుబెల్లా కేసులు గణనీయంగా తగ్గాయనీ, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







