విదేశి టపాసులను నిరోధించిన ప్రభుత్వం
- September 29, 2016
ఏటా దీపావళి పండుగ సమయంలో ఇబ్బడిముబ్బడిగా వినియోగిస్తున్న విదేశీ బాణాసంచా దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై విదేశీ బాణాసంచా అమ్ముతున్నట్లు ఎవరైనా స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటారని కేంద్రవాణిజ్యపన్నుల శాఖ స్పష్టం చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఏటా భారత్‌కు విదేశీ బాణాసంచా దిగుమతి అవుతున్నట్లు డీఐపీపీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రమాదకర రసాయనం పొటాషియం క్లోరేట్‌తో తయారైన పేలుడు పదార్థాలు స్వేచ్ఛగా దిగుమతి అవుతున్నట్లు దేశీయ బాణాసంచా వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సల్ఫర్, సల్ఫ్యూరేట్‌లను ఏదైనా క్లోరేట్ మిశ్రమంలో కలిపి తయారు చేసే విస్ఫోటనాల వినియోగంపై కూడా భారత్‌లో నిషేధం ఉంది. 2008 చట్టప్రకారం ఇప్పటి వరకూ బాణాసంచా దిగుమతులకు ఎలాంటి అనుమతులు లేవని, ఇకపై ఇవి తమ దృష్టికి తీసుకొస్తే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని డీఐపీపీలోని ఓ ముఖ్యఅధికారి చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







