పారాలింపిక్స్ విజేతలకు 90 లక్షలు బహుమతి ప్రకటించిన ప్రభుత్వం
- September 29, 2016
రియో పారాలింపిక్స్ విజేతలకు రూ. 90లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2016లో రియో పారాలింపిక్స్‌లో భారత పారా-అథ్లెట్‌లు నాలుగు పతకాలు సాధించి చరిత్ర సృష్టించి దేశం గర్వ పడేలా చేశారని సామాజిక న్యాయ, సాధికారత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. దీంతో పతక విజేతలందరికీ కలిపి రూ.90లక్షల రివార్డును అందజేయాలని ఆ శాఖ నిర్ణయించినట్లు గెహ్లాట్ పేర్కొన్నారు.
బంగారు పతకాలు సాధించిన హైజంపర్ మరియప్పన్ తంగవేలు, జావెలిన్ త్రోవర్ దేవేంద్ర జజారియాలకు ఒక్కొక్కరికి రూ.30లక్షలు, షాట్‌పుట్‌లో రజతం సాధించిన దీపామలిక్‌కు 20లక్షలు, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ భాటికి 10లక్షలు రివార్డుగా అందించనున్నట్లు అధికారులుప్రకటనలో తెలిపారు. ఈ నగదును ఎవేర్‌నెస్ జనరేషన్ అండ్ పబ్లిసిటీ పథకం(ఏజీపీ) కింద గెహ్లాట్ అందజేస్తారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







