హైదరాబాదులో ఐఎస్ఐఎస్ కు బలైపోయిన ఓ యువకుడు
- September 29, 2016
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కదలికలు తాజాగా నగరంలో కలకలం రేపాయి. ఓ మైనారిటీ విద్యాసంస్థలో ఐసిస్ శిక్షణ కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలక్‌పేట్‌లోని ఈ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదరీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో 'సేవ్ కంట్రీ' పేరిట పోస్టులు పెట్టారు. తనకు ఉగ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉందని, తనను గత ఏడాది చంపేందుకు ఐఎస్ఐ ఏజెంట్లు ప్రయత్నించారని ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. ఐసిస్ శిక్షణ కేంద్రం హైదరాబాద్‌లో కొనసాగుతున్నదని, ఈ విషయంలో కాలేజీ మేనేజ్‌మెంట్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఫేస్‌బుక్‌లో తెలిపారు. తాను ఆ ఒక్క ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్తున్నానని, మొత్తం కమ్యూనిటీ గురించి కాదని అన్నారు. భారత్ మతాకీ జై, సేవ్ ఇండియా అంటూ పోస్టులు చేశారు. లెక్చరర్ ప్రవీణ్‌కుమార్ మృతి నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సదరు విద్యాసంస్థ మాత్రం ఆ లెక్చరర్ ఆరోపణలు నిరాధారమని, అతని మృతితో తమకు సంబంధం లేదని చెప్తోంది.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









