పాక్ నటీనటులకు నిషేధం విధించిన ఐఎంపిపిఏ
- September 29, 2016
భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సినీ రంగానికి తాకాయి. పాక్ నటులు, టెక్నీషియన్లపై నిషేధం విధిస్తున్న ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ ఆసోసియేషన్(ఐఎంపీపీఏ) తాజాగా ప్రకటన చేసింది. భారత్-పాక్ మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. ఉరీ ఉగ్రదాడి సందర్భంగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న పాక్ నటీనటులందరూ దేశం విడిచి వెళ్లిపోవాలని ఇటీవలే శివసేన పార్టీ హెచ్చరికలు జారీచేసింది. ఈ క్రమంలోనే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఫవాద్ ఖాన్ గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్ వెళ్లిపోయాడు. పాక్ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం లక్షిత దాడులకు పాల్పడటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎంపీపీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







