శాంతియుతమైన ఒమాన్ కోసం పౌరులు, ప్రవాసీలు కలసి పనిచేయాలి

- August 13, 2015 , by Maagulf
శాంతియుతమైన ఒమాన్ కోసం పౌరులు, ప్రవాసీలు కలసి పనిచేయాలి

ఒమాన్ యొక్క  సాంఘిక పురోభివృద్ధి, ఆర్ధిక పురోగతి - పౌరులు మరియు ప్రవాసీయులు ఒకరినొకరు గౌరవించుకుని, స్నేహ సుహృద్భావ వాతావరణం కల్పించినపుడే సాధ్యమౌతుందని, దురుద్దేశాలకు పౌరులు కానీ ప్రవాసులు కానీ తావీయరాదని, సోషల్ మీడియాలోను, మరికొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నట్టు వైరపూరిత వాతావరణం కాక, వారు సరైన మార్గంలో నచుకోవాలని, ఇంజాజ్ ఒమాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ షబీబ్ అల్ మామరీ విజ్ఞప్తి చేశారు. కొన్ని చర్చలలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు పౌరులు ప్రవాసీయులను విమర్శిస్తున్నారని, కానీ ప్రవాసీయులు స్వదేశానికి దూరంగా ఉంటూ, ఒమానీయుల కంటే రెండింతలు ఎక్కువగా దేశనిర్మాణానికై శ్రమిస్తున్నారని తెలుసుకోవాలని, అదే విధంగా ప్రవాసులు ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని , చట్టాలను గౌరవించాలని ఆయన వీశదీకరించారు.


--నూనె లేని కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com