గూగుల్ త్వరలో భారత్‌లో క్లౌడ్ సేవలు అందుబాటులోకి...
- September 30, 2016
ప్రముఖ సెర్చ్ఇంజన్ కంపెనీ గూగుల్ త్వరలో భారత్‌లో క్లౌడ్ సేవలు అందుబాటులోకి తేనుంది. భారతీయ డెవెలపర్స్, ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు క్లౌడ్ సేవలను మెరుగుపరిచేందుకు 'గూగుల్ క్లౌడ్ రీజియన్'ను ప్రారంభించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. వచ్చే ఏడాది ముంబయిలో గూగుల్ తమ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. గురువారం శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ రీజియన్లపై ప్రకటన చేసింది. ముంబయి, సింగపూర్, సిడ్నీ, ఉత్తర వర్జీనియా, సావో పాలో, లండన్, ఫిన్‌ల్యాండ్, ఫ్రాంక్ఫర్ట్ ఎనిమిది ప్రాంతాల్లో కొత్తగా క్లౌడ్ రీజియన్లను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది.భారత్‌లో ఇప్పటికే గూగుల్ విప్రో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా స్మార్ట్‌షిఫ్ట్, దైనిక్ భాస్కర్ గ్రూప్, ఇన్‌షార్ట్స్.కామ్ తదితర కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. వీటి అప్లికేషన్లను గూగుల్ ఇప్పటికే హోస్ట్ చేస్తోంది. అయితే భారత్‌లో కొత్త డేటా సెంటర్ల ద్వారా ఇక్కడి స్థానిక కస్టమర్లకు వేగంగా సేవలు అందించగలమని గూగుల్ పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం అమెజాన్‌కు మూడు, మైక్రోసాఫ్ట్‌కు మూడు డేటా సెంటర్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







