'గుంటూరోడు' గా రానున్న మంచు మనోజ్

- September 30, 2016 , by Maagulf
'గుంటూరోడు' గా రానున్న మంచు మనోజ్

సత్య దర్శకత్వంలో మంచు మనోజ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గుంటూరోడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 'కంచె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ప్రగ్యా జైశ్వాల్‌ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. సంపత్‌, రావు రమేశ్‌, కోటా శ్రీనివాసరావు తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీవరుణ్‌ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మనోజ్‌ ఈ చిత్రం కాకుండా సాగర్‌ ప్రసన్న దర్శకత్వంలో సీతా మహాలక్ష్మి(మదర్‌ ఆఫ్‌ ర్యాంబో), అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వంలో 'ఒక్కడు మిగిలాడు' చిత్రాల్లో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com