రోడ్‌ ప్రాజెక్టులతో మెరుగైన రవాణా

- September 30, 2016 , by Maagulf
రోడ్‌ ప్రాజెక్టులతో మెరుగైన రవాణా

జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ - ట్రాఫిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌, దోహాలో పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ (అష్గల్‌)తో కలిసి పలు ప్రాజెక్టుల్ని వాహనదారుల కోసం చేపడ్తోంది. ఈ కారణంగా ట్రాఫిక్‌ సమస్యల నుంచి వాహనదారులకు ఊరట లభిస్తోంది. ఈ విషయమై ట్రాఫిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ మరాఫి మాట్లాడుతూ, మోటరిస్టులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించగలుగుతున్నామనీ, అలాగే నడిచి వెళ్ళేవారికి కూడా ఎంతో మేలు చేస్తున్నామని అన్నారు. కొత్త రోడ్లు, బ్రిడ్జ్‌లు వాహనాలు స్మూత్‌గా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తాయనీ, ట్రాఫిక్‌ సమస్యలకు తావే ఉండదని ఆయన తెలిపారు. కొత్త రోడ్లపైకి ఎంట్రీ, ఎగ్జిట్‌లను చాలా అద్భుతంగా డిజైన్‌ చేయించడం వల్ల వాహనదారులు కొత్త ప్రాజెక్టుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తమకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వివరించారాయన. షమాల్‌ రోడ్‌పై 19 ఇంటర్‌ ఛేజ్‌లను ప్లాన్‌ చేశారు. జంక్షన్‌ 5 వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్‌ ఛేంజ్‌ దుహైల్‌ స్ట్రీట్‌ని దోహా రూట్‌లో కనెక్ట్‌ చేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com