ఆరోగ్యం పెంపొందాలంటే.. అరటి పండులో జీలకర్ర పొడిని వేసి తీసుకుంటే....
- September 30, 2016
మన ఇంట్లో వండే పదార్థాలకు పోపు వేసేటపుడు జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరప కాయలు వాడతారు. అందులో వేసే జీలకర్ర ఒంటికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అసలు ఆ జీలకర్రని పొడి చేసి... తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. జీలకర్ర ఏకాగ్రతను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీలకర్ర పొడి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని సమతూకంలో ఉంచుతుంది. కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణ శక్తి పెంపొందిస్తుంది. కడుపులోని గ్యాస్‌ని బయటకి నెట్టి వేస్తుంది. అరటిపండుని తీసుకొని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే.. హాయిగా నిద్ర వస్తుంది. అధిక బరువు తగ్గుతారు. లైంగిక ఆరోగ్యం పెంపొందాలంటే.. జీలకర్ర పొడిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మురికిని, ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. పైత్యరసం ఫాట్స్‌ను విఛిన్నం చేయటంలో పోషకాలను గ్రహించటంలో సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







