'యు' ధ్రువీకరణ పత్రం పొందిన 'దేవి'

- September 30, 2016 , by Maagulf
'యు' ధ్రువీకరణ పత్రం పొందిన 'దేవి'

ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం 'దేవి'. 'మదరాసపట్టిణం', 'తలైవా' వంటి సినిమాలను రూపొందించిన విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం ఈ సినిమా సెన్సార్‌కు వెళ్లొచ్చింది. దీనిని చూసిన అధికారులు 'యు' ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల ఏడో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కె.గణేశ్‌ నిర్మించిన ఈ సినిమాలో సోనూసూద్‌ ముఖ్యపాత్ర పోషించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఇదిలా ఉండగా శివకార్తికేయన్‌ నటించిన 'రెమో' సినిమా కూడా ఏడో తేదీన తెరపైకి రానుంది.అలాగే విజయ్‌సేతుపతి నటించిన 'రెక్క' చిత్రం కూడా అదే రోజున అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com