'బాహుబలి- ద లాస్ట్ లెజెండ్స్' యానిమేషన్ టీజర్ విడుదల...
- October 01, 2016
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని మరింత పెంచిన 'బాహుబలి- ద లాస్ట్ లెజెండ్స్' యానిమేషన్‌కి సంబంధించిన టీజర్‌ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా దీన్ని అభిమానులతో పంచుకున్నారు. బాహుబలి యానిమేషన్ సిరీస్‌ను తయారు చేయడానికి ఆర్కా మీడియా, గ్రాఫిక్ ఇండియా, అమెజాన్ చేతులు కలిపాయని తెలిపారు. ఇంతవరకు ఏ వ్యాణిజ్య సంస్థ చేయని కొత్త ప్రయోగం చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొంటూ.. 'బాహుబలి' యానిమేటెడ్ టీజర్ లింక్‌ను పోస్ట్ చేశారు. .ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్'ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. 22వ తేదీన తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







