అక్రమ యూటర్న్, ఓవర్‌టేకింగ్‌పై రాడార్ కన్ను
- October 01, 2016
దుబాయ్: దుబాయ్ రోడ్లు ఇకపై మరింత సేఫ్‌గా మారనున్నాయి. కొత్త రాడార్లను రహదార్లపై ఏర్పాటు చేసి, అక్రమంగా యూటర్న్ తీసుకునేవారినీ, నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌టేకింగ్ చేసేవారినీ ఓ పట్టు పట్టనున్నారు దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు. మొత్తం 28 కొత్త రాడార్లను పలు ముఖ్యమైన రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇంటర్‌సెక్షన్స్, సిగ్నల్స్ వద్ద వీటిద్వారా వాహనదారుల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దమాస్కస్ స్ట్రీట్, హలెబ్ స్ట్రీట్ మరికొన్ని ప్రాంతాల్లో ఈ కొత్త రాడార్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. యూరోప్‌లో ఈ తరహా రాడార్లు పనిచేస్తున్నాయనీ, అక్కడ ట్రాఫిక్ స్మూత్‌గా ఉంటుందని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. నిబంధనల ఉల్లంఘనను కొత్త రాడార్ గుర్తించగానే, ఆ విషయాన్ని కమాండ్ సెంటర్‌కి ఎస్‌ఎంఎస్ రూపంలో తెలియజేస్తుంది. వాహన వేగాన్ని గుర్తించడం, ఆ వాహన నెంబర్ ప్లేట్‌ని నమోదు చేయడం వంటివి ఈ కొత్త రాడార్‌లో ఇంకా సమర్థవంతంగా ఉంటాయని అధికారులు తెలిపారు. యెల్లో బ్లాక్ వయొలేషన్స్, డేంజరస్ ఓవర్‌టేకింగ్స్, యూ-టర్న్స్ వంటివాటినీ రాడార్ పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







