విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా...
- October 03, 2016
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పది జిల్లాలకే కాకుండా విదేశాలకు కూడా వ్యాపించింది. అక్కడక్కడా అట్టహాసంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. గ్రామాల నుంచి మొదలుకుని పట్టణ, జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ సందడి నెలకొంది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుతూ మహిళలు, యువతులు ఉత్సాహాంగా బతుకమ్మ పాటలు పాడుతున్నారు. ఒక్కేసి.. పువ్వేసి చందమామ అంటూ తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ సంబరాలతో హోరెత్తుతుంది. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసే క్రమంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.అందులోభాగంగా జాగృతి అధ్యక్షురాలు, రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత శాన్‌ఫ్రాన్సిస్కోలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మను పేర్చిన కవిత.. నాగమల్లె జాతరో పాట పడి బతుకమ్మను పేర్చి ఆడపడుచులను ఉత్సాహపరిచారు. ఈ బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఆడపడుచులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







