రక్తసిక్తమైన బాగ్దాద్ నగరం

- October 03, 2016 , by Maagulf
రక్తసిక్తమైన బాగ్దాద్ నగరం

ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిలింది. షియాలు అధికంగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో 15 మంది పౌరులు మృతి చెందారు. అల్-అమిల్‌లోని ఓ రద్దీ మార్కెట్‌లో ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు దుకాణదారులు మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మస్తాల్‌లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. సబి అల్-బోర్‌లో ఓ బాంబు పేలడంతో మరో ముగ్గురు పౌరులు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. ఈ దాడులను పోలీసులకు ధ్రువీకరించారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ నుంచీ ప్రకటన విడుదల కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com