జీతాలపై చమురు ఘాటు - సౌదీ

- October 03, 2016 , by Maagulf
జీతాలపై చమురు ఘాటు - సౌదీ

చమురు ధరల ప్రభావంతో ఆర్ధిక రంగం కుప్పకూలిపోవడంతో పాలనలో విప్లవాత్మక మార్పులకు సౌదీ శ్రీకారం చుడుతోంది. వీసా ఫీజులను పెంచుతూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా క్యాలెండర్ మార్పు, జీతభత్యాల తగ్గింపు వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది. క్యాలెండర్ మార్పుతో దేశంలోని ఉద్యోగులు, పనివాళ్లతో అదనంగా 11 రోజులపాటు ఉచితంగా పనిచేయించుకోవడమే కాకుండా కూలి వేతనాలను కూడా భారీగా తగ్గిస్తూ సౌదీ రాజు సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వోద్యోగులకు ఇప్పుడు ఇస్తున్న జీతంలో నుంచి 20 శాతాన్ని తగ్గించి ఇవ్వాలనీ, ప్రోత్సాహకాల్లో 15 శాతం కోత విధించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నిర్ణయాల ద్వారా ఆర్ధికంగా ప్రభుత్వానికి లాభించి, నష్టాల నుంచి గట్టెక్కగలమని భావిస్తున్నానన్నారు. ఈ మార్గదర్శకాలకు దేశ ప్రజలు సహకరించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com