చైనా లో కలకలం రేపిన యువకుడు
- October 03, 2016
చైనాలో ఘోరం జరిగింది. యునాన్ ఫ్రావిన్స్ రాజధాని కున్ మింగ్లో చిరు ఉద్యోగం చేస్తున్న యాంగ్ జింగ్ పె (27) అనే యువకుడు తల్లి దండ్రులతో సహా 19 మంది అత్యంత దారుణంగా హతమార్చాడు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే... 1989లో జన్మించిన యాంగ్ జింగ్ పె అనే యువకుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. దీంతో స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చాలంటూ వారంతా ఒత్తిడి చేయడంతో డబ్బు కోసం సొంత ఊరికి వెళ్లాడు. తాను చేసిన అప్పులు తీర్చాలని తల్లిదండ్రులను ఒత్తిడిపై పెంచాడు. అయితే వ్యసనాల బారిన పడిన కుమారుడి అప్పులు తీర్చేందుకు వారు అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన యాంగ్ జింగ్ పె తల్లిదండ్రులిద్దర్నీ అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే పోలీసు విచారణలో తన వివరాలు పక్కింటి వాళ్లు చెప్పే అవకాశం ఉందని భావించి వారిని కూడా చంపేశాడు. ఇలా తనను అనుమానించే ప్రతి ఒక్కరినీ అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇలా ముగ్గురు చిన్నపిల్లలు సహా మొత్తం 19 మందిని హత్య చేశాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్టు తన గ్రామం కున్ మింగ్ నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిపోయాడు. కాగా చైనాలో వరుసగా హత్యలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా 'యాంగ్ జింగ్ పె'ను అనుమానితుడిగా తీసుకుని తమదైన శైలిలో విచారించగా 19 మందిని హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసు షాక్కు గురయ్యారు. దీంతో అతనికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









