నారా రోహిత్ హీరోగా 'శంకర'
- October 04, 2016
"అతను కాలేజీలో చదువుతున్న కుర్రాడు. ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితంలోకి అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి. ఆ అవరోధాలను అతను ఎలా అధిగమించాడు" అనే కథతో తెరకెక్కిన చిత్రం 'శంకర'. నారా రోహిత్ హీరోగా నటించిన 'శంకర' అక్టోబర్ 21న విడుదల కానుంది. రెజీనా నాయికగా నటించారు. తాతినేని సత్య ప్రకాశ్ దర్శకత్వం వహించారు. శ్రీ లీలా మూవీస్ పతాకంపై రూపొందింది. జె.ఆర్.మీడియా ప్రై.లిమిటెడ్‌తో కలిసి ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) నిర్మించారు. ఎం.వి.రావు సమర్పించారు. తమిళంలో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న `మౌనగురు` చిత్రానికి రీమేక్ ఇది. అక్కడ అరుళ్‌నిధి హీరోగా నటించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కాసుల సవ్వడి చేసింది.
'శంకర' చిత్రం గురించి నిర్మాత ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) మాట్లాడుతూ "వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు శంకర అనే కుర్రాడికి నచ్చవు. వాటిని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న అడ్డంకులు ఎలాంటివి? దానికి అతని తల్లి, సోదరుడు ఇచ్చిన చేయూత ఎలాంటిది వంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం మా `శంకర`. సాయికార్తిక్ మంచి సంగీతాన్నిచ్చారు. ట్యూన్లకు చక్కటి స్పందన వస్తోంది" అని అన్నారు.చిత్ర సమర్పకుడు ఎం.వి.రావు మాట్లాడుతూ "అక్టోబర్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది. నారా రోహిత్ కెరీర్లో మంచి సినిమాగా నిలుస్తుంది" అని చెప్పారు.జాన్ విజయ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్ రెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







