పనీర్ కీరా కర్రీ
- October 04, 2016
కావలసిన పదార్థాలు: కీరా దోసకాయ - అరకేజి, పనీర్ 60 గ్రా., వెన్న - 10 గ్రా., జీడిపప్పు - 50గ్రా., పచ్చిమిర్చి - 5 గ్రా., టమేటో గుజ్జు - 25 గ్రా., ఉల్లిపాయ గుజ్జు - 75 గ్రా., అల్లం పేస్టు - 25 గ్రా., వెల్లుల్లి పేస్టు - 12గ్రా., గరం మసాలా పొడి - 6గ్రా., కొత్తిమీర - 1 కట్ట, ఎండుమెంతి - 4 గ్రా., క్రీమ్ - 100 గ్రా., ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి గిన్నెలో తరిగిన పనీర్, పచ్చిమిర్చి, సగం జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర, మసాలపొడి వేసి బాగా కలుపుకోవాలి. కీరాను తొక్కతీసి అంగుళం మేర గుండ్రటి చక్రాల్లా తరిగి లోపలి గింజల్ని తీసేసి అందులో పనీర్ మిశ్రమాన్ని కూరాలి. కడాయిలో వెన్న వేడి చేసి, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, టమేటో పేస్టులను వేసి వేగించాలి. తర్వాత మిగిలిన జీడిపప్పు, మసాలపొడి, ఎండుమెంతి, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచాక పనీర్ కూరిన కీరాముక్కల్ని వేసి నిమిషం తర్వాత దించేసి క్రీమ్, కొత్తిమీరలతో అలంకరించాలి. ఇది పుల్కాలతో గానీ అన్నంతో గానీ తింటే చాలా రుచిగా ఉంటుంది
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







