ఐసిస్‌పై పోరులో రష్యా మరో అడుగు ముందుకి...
- October 04, 2016
ఐసిస్‌పై పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. గగనతల రక్షణకు సంబంధించిన క్షిపణి వ్యవస్థ ఎస్-300ను సిరియాలోని రేవుపట్టణం టార్టస్‌కు చేర్చింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి లొగోర్ కొనషిన్‌కోవ్ తెలిపారు. వైమానిక దాడులు జరగకుండా రష్యా స్థావరాల్ని రక్షించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఇది ఎవరిపైకి గురిపెట్టేందుకు కాదని ఆయన చెప్పారు.పశ్చిమ ప్రాంతంలో పోరును తీవ్రతరం చేసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే సోమవారం వైమానిక దాడులను సమన్వయం చేసుకునేందుకు రష్యాతో సమావేశమైంది.ఎస్‌ఏ-23గా సుపరిచితమైన ఎస్-300 వ్యవస్థను ఇప్పటి వరకు రష్యా బయట వినియోగించలేదు. దీనిని పూర్తిగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించవచ్చు. దీని రాడార్లు, లాంఛర్లు, కమాండ్ వ్యవస్థను ట్రక్కులపై తరలించే వీలుంది. దీనికి ఎస్-400 వ్యవస్థను కూడా చేరిస్తే పూర్తిస్థాయి వైమానిక నిరోధక వ్యవస్థ సిద్ధమైపోతుంది. ఇప్పటికే ఈ వ్యవస్థ సమీపంలోని రష్యా వైమానిక స్థావరమైన లటాకియాలో ఉంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







