గ్రేట్ ఫెస్టివల్ సేల్ ఆఫర్‌లో స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు..
- October 04, 2016
పండగలను పురస్కరించుకుని స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు.. ఫెస్టివ్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఆఫర్‌లో భాగంగా జెట్ ఎయిర్‌వేస్ ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో టికెట్ ధరలు 396 రూపాయల నుంచి ప్రారంభం కానుండగా స్పైస్‌జెట్ టికెట్ ధరలు 888 రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయి.కాగా అంతర్జాతీయ రూట్లకు సంబంధించి టికెట్ ధరలు 3,699 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని స్పైస్‌జెట్ తెలిపింది. గ్రేట్ ఫెస్టివల్ సేల్ ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులు ఈ నెల 4 నుంచి 7 వ తేదీ వరకు టికెట్లను బుక్‌చేసుకున్న ప్రయాణికులు నవంబర్ 8 నుంచి 2017 ఏప్రిల్ 13 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని స్సైస్ జెట్ పేర్కొంది. బెంగళూరు- కోచి, ఢిల్లీ- డెహ్రడూన్, చెన్నై- బెంగళూరు వంటి మార్గాల్లో 888 రూపాయల ఆఫర్ (ఆల్ ఇన్, వన్ వే) అందుబాటులో ఉండనుండగా చెన్నై-కొలంబో రూట్లలో 3,699 రూపాయల ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కాగా స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లను ఈ నెల 4 నుంచి 7 వరకు అందుబాటులో ఉంటాయని జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది.టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు నవంబర్ 8 నుంచి ప్రయాణించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







