ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు..

- October 05, 2016 , by Maagulf
ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్షీణించిందంటూ వదంతులు సృష్టించిన 50 మంది జాబితాను సిద్ధం చేసినట్టు రాష్ట్ర పోలీసుశాఖ ప్రకటించింది. వీరిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సెయింట్‌ ఆస్పత్రి నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్‌ జాన్ బీలేతో పాటు వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు జయకు చికిత్స అందిస్తున్నారు. మధ్యలో కొంతకాలం ఆగినా, సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆస్పత్రి ప్రతిరోజూ మెడికల్‌ బులెటిన్ విడుదల చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com