137 నిబంధనల ఉల్లంఘనల గుర్తింపు
- October 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్ (ఎంఇసి) 137 నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నోటీసుల్ని సెప్టెంబర్‌లో జారీ చేసింది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌కి సంబంధించి ఈ నోటీసుల్ని జారీ చేసింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టం నెంబర్ 8 - 2008 ప్రకారం పేర్కొన్న నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలకు తీసుకోబడ్తాయి. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఈ నిబంధనల ఉల్లంఘలనలు గుర్తించారు అధికారులు. 5,00 ఖతారీ రియాల్స్ నుంచి 30,000 ఖతారీ రియాల్స్ వరకు ఆయా నిబంధనల ఉల్లంఘనల్ని బట్టి జరీమానాలు విధించబడ్డాయి. అరబిక్‌లో బిల్స్ ఇవ్వకపోవడం, ప్రోడక్ట్‌కి సంబంధించిన సమాచారాన్ని పేర్కొనకపోవడం, డిక్లరేషన్స్ మరియు స్టేట్‌మెంట్స్‌ని అరబిక్ భాషలో ప్రస్తావించకపోవడం, ఓ ప్రోడక్ట్‌ని ప్రదర్శనకు ఉంచడం లేదా ప్రచారం చేసిన సందర్భంలో తప్పుడు సమాచారాన్ని ఉపయోగించడం, నిర్ధారిత ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడం, గడువు తీరిన పదార్థాల్ని అమ్మడం లేదా ప్రదర్శనకు ఉంచడం వంటివి ఈ నిబంధనల ఉల్లంఘనల్లో గుర్తించబడ్డాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







