జాగ్వర్:రివ్యూ
- October 06, 2016
నటీనటులు: నిఖిల్‌కుమార్, దీప్తి ,జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, రావు రమేష్, రమ్యకృష్ణ తదితరులు
సమర్పణ: హెచ్.డి. కుమారస్వామి
కథ: విజయేంద్ర ప్రసాద్
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస
మ్యూజిక్: యస్.యస్. థమన్
ఆర్ట్: నారాయణరెడ్డి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్: రవివర్మ, రామ్-లక్ష్మణ్, కలోయాన్ (బల్గేరియా), సెల్వ
కో డైరెక్టర్: అమ్మినేని మాధవసాయి
నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి
స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్
రాజకీయాలకు, సినిమాలకు చుట్టరికం ఎప్పుడో మొదలయ్యింది.. అయితే కర్నాటకలో రాజకీయ కుటుంబం నుండి వస్తున్నవారసుడు సినిమా అంటే అంచనాలతో భారీగా ఉంటాయి.. నిఖిల్ ఎంట్రీకి కుమార స్వామి భారీ ఎర్పాట్లు చేసాడు. ఒక కన్నడ ప్రేక్షకులనే మాత్రమే కాదు, సౌత్ ని మొత్తం ఎట్రాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు.. మరి జాగ్వర్ స్పీడ్ ఎంటో తెలుసుకుందాం...
కథ:
అనాథ అయిన ఎస్. ఎస్. కృష్ణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్, అల్లరి చిల్లరిగా తిరిగే కృష్ణ కి తన సీనియర్ ఆర్య చెల్లలు(దీప్తి సతి) ని ఇష్టపడతాడు. ఆర్య కాలేజ్ లో మెరిట్ విద్యార్ధి, అతనంటే కాలేజ్ తో పాటు లెక్చరర్స్ కూడా గౌరవం. సరదాగా కనిపించే కృష్ణ ఒక ఛానెల్ ని హ్యాక్ చేసి లైవ్ లో మర్డర్స్ చేస్తుంటాడు. ఈ హాత్యలను ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిబిఐ ని నియమిస్తుంది ప్రభుత్వం.. ఆ సిబిఐ ఆఫీసర్ (జగపతిబాబు) హాత్యలను ఇన్వెస్ట్ గేట్ చేస్తుంటాడు. కృష్ణ చేసే హాత్యలు వెనుక కారణం ఏంటి..? తను చదివే మెడికల్ కాలేజ్ ఛైర్మన్ తో కృష్ణ కి మద్య నడిచే యుద్దానికి కారణం ఏంటనేది మిగిలిన కథ..?
కథనం:
ఒక హీరోని కమర్షియల్ ప్రొజెక్ట్ చేయడానికి కావాల్సిన అన్ని హాంగులతో పాటు కమర్షియల్ కథను రెడీ చేసుకున్నాడు కుమార స్వామి. మెడికల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ కథను సమర్ధవంతంగా నడిపాడు దర్శకుడు మహాదేవ్. హీరోని అండర్ డాగ్ క్యారక్టరైజేషన్ లో ప్రొజెక్ట్ చేయడం.. తర్వాత సీన్ బై సీన్ అతన్ని రివీల్ చేయడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా మారింది. మనోజ్ పరమహాంస సినిమా కి రిచ్ లుక్ ని తెచ్చాడు. కన్నడ సినిమా పరిశ్రమ రేంజ్ ని పెంచిన మూవీ జాగ్వర్ సినిమా లో రిచ్ నెస్ తో పాటు నిఖిల్ అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. వైద్య వృత్తి పై ఆదర్శ్ తో దర్శకుడు చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. కార్పోరేట్ హాస్పటల్స్ వైద్యం పేరుతో చేస్తున్న వ్యాపారాన్ని మనసులు కదిలించే విధంగా చిత్రీకరించాడు దర్శకడు మహాదేవ్. కథ లో హీరో క్యారెక్టరైజేషన్ ని హైప్ చేయడానికి హాస్పటల్ సీన్ బాగా డిజైన్ చేసాడు. అయితే పాటలు, లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ అవ్వవు. హీరో ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్ తో పాటు కథనం గ్రిప్పింగ్ గా సాగడం జాగ్వర్ కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒక కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవడానికి కావాల్సిన సరంజామాతో కథను రెడీ చేసుకున్నాడు దర్శకుడు మహాదేవ్. ‘‘నేను ఎదగడానికి పది మందికి మొక్కడానికికయినా, వంద మందిని తొక్కడానికి అయినా రెడీ’’ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరిది అనేది ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. స్టైలిష్ కాప్ గా జగపతిబాబు మెప్పించాడు. జగపతిబాబు ఆఫీస్ లో విలన్ హీరో ల మద్యనడిచే సన్నివేశం చాలా బాగుంది. హీరోయిన్ దీప్తి సతికి పెద్ద చెప్పుకోతగ్గ క్యారెక్టర్ లేదు.. పాటల్లో ఎనర్జిటిక్ గా కనిపించింది. ఇక రావు రమేష్ మరోసారి సినిమాకి అసెట్ గా మారాడు. ఒక సన్నివేశంలో డబ్బులు దొంగిలించిన కుర్రాడితో రావు రమేష్ సంబాషణ సినిమాతో పాటు అతని క్యారెక్టరైజేషన్ కి హైలెట్ గా నిలిచింది. ‘‘ పిల్లలను దొంగ అని తల్లిదండ్రులే అంటే అది వారు చెడిపోవడానికి మొదటి అవకాశం ’’ అవుతుందనే మాటను చాలా అర్దం వంతంగా చెప్పాడు, మనసాక్షికి మించిన అదుపు ఎవరు పెట్టలేరనే ఆ సన్నివేశం సినిమా విలువలను పెంచింది. కథకు, సినిమాకి ఆయువుపట్టుగా మారిన ఆ పాత్రను చాలా నాచురల్ గా చేసాడు రావు రమేష్. గతవారం హైపర్ వేడి తగ్గక ముందే మరో కీ రోల్ లో రావు రమేష్ అదరగొట్టాడు. బ్రహ్మానందం పాత్ర అంతగా ఆకట్టుకోలేదు.థమన్ ట్యూన్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమా లో ఛేజింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ గా చెప్పుకోవచ్చు.. జాగ్వర్ ని వేంటాడే సన్నివేశం చాలా బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. సినిమాలో హీరోతో పాటు ఆదర్శ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యింది. తెలుగులో చిన్నా చితకా రోల్స్ తో సరిపెట్టుకున్న ఆదర్శ్ కి జాగ్వర్ పెద్ద ప్లాట్ ఫామ్ ని ఇచ్చింది. తను చేసిన సిన్సియర్ మెడికో క్యారెక్టర్ ని అందులోని ఎమోషన్స్ ని సమర్ధవంతంగా పండిచగలిగాడు. ఆర్టిస్ట్ సత్తా తెలియాలంటే ఒక సీన్ చాలు..రమ్యకృష్ణ క్లైమాక్స్ కి ఎమోషనల్ ఫోర్స్ ని అందించింది.
చివరిగా:
గ్రిప్పింగ్ రివేంజ్ స్టోరీ విత్ లౌడ్ యాక్షన్
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









