గర్భిణీ ప్రియురాలిని హతమార్చిన భారతీయునికి జైలు శిక్ష
- October 06, 2016
నా కడుపులో ఉంది... నీ బిడ్డ మాత్రం కాదని నిప్పు లాంటి నిజాన్ని తాపీగా చెప్పిన తనతో పాటు చదువుకొంటున్న పంజాబ్ గర్భిణీ ప్రియురాలిని..బతకనీయలేదా భారతీయ విద్యార్థి ప్రియుడు ఆగ్రహంతో ఆమెపై దాడి చేసి 29 కత్తిపోట్లు పొడిచి దారుణంగా హతమార్చేడు. న్యూజీలాండ్ లో ఇటీవల సంచలనం కల్గించిన ఈ నేరానికి సంబంధించి తుది తీర్పు మంగళవారం కోర్టు వెలువరించింది. ఆ నిందితుడికి జీవితఖైదు విధించింది.
ఆకాష్ అనే 24 ఏళ్ళ నిందితుడు క్రూరత్వం మరియు మృగత్వం నిర్దయతో తన ప్రియురాలైన 22 ఏళ్ల గురుప్రీత్ కౌర్ ను అంతమొందించాడని ఆక్లాండ్ హైకోర్టు న్యాయమూర్తి మాథ్యూ పాల్మెర్ తన తీర్పు పాఠంలో తెలిపారు. ఈ జంట రహస్యంగా గత 12 నెలల నుంచి డేటింగ్ చేస్తున్నారని, గురుప్రీత్ కౌర్ ఒక రోజు ఆకాష్ తో సంబంధానాన్ని తెగతెంపులు చేసుకోవాలని తలచి...నా గర్భంలో పెరుగుతున్న శిశువు నీ అంశ కాదు...మరొకరి హింస అని నొక్కి చెప్పింది....దాంతో తిక్క నషాళానికి ఎక్కిన ఆ కుర్ర సర్దార్జీ ఈ ఏడాది ఏప్రిల్ 7 వ తేదీన ఆమెపై దాడి చేసి పాశవికంగా 29 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఆక్లాండ్ లోని దక్షిణాన రోడ్డుపక్కన ఉన్న పొదలలోనికి తోసివేశాడు.
తొలుత నిందితుడు ఆకాష్ తాను ఆమెను కావాలని చంపలేదని..ఒక తీవ్రమైన వాదనలో గురుప్రీత్ కౌర్ కు కత్తి గాయాలయ్యాయని వాదిస్తూ వచ్చాడు ..కానీ హత్య జరిగిన నాలుగు నెలల తర్వాత ఆగష్టు లో, తానే ఆమెను చంపినట్లు నేరాన్ని అంగీకరించి తన తప్పు ఒప్పుకున్నాడు. చనిపోయిన కౌర్ 7 నుంచి 10 వారాల లోపు గర్భవతి అని నిజానికి అది ఎంతో తీవ్రమైన నేరమని ఆమె కుటుంబంకు ఇది ఎంతో బాధాకరమైన విషయమని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరానికి బాధ్యుడైన ఆకాష్ జైలు ఊచల మధ్య కనీసం 17 సంవత్సరాలు గడిపేలా యావజ్జీవ శిక్షను న్యాయస్థానం విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







