తెలంగాణ ఉద్యోగులకు దసరా సెలవులు లేవు
- October 06, 2016
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు దసరా సెలవుల్లోనూ పనిచేయనున్నారు. సచివాలయంలో ముఖ్య విభాగం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8, 9, 10 తేదీల్లో ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖ, హోం, ఫైనాన్స్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు హాజరు కావాలని సూచించింది.
పండుగ రోజుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు కాంపన్సేటరీ, క్యాజువల్ లీవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ రోజున కొత్త జిల్లాలు ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









