19.4 టీఆర్పీ రేటింగ్ సాధించిన 'బిచ్చగాడు'
- October 07, 2016
విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో 'పిచ్చైకారన్' సినిమా నిర్మించిన ఫాతిమా విజయ్ ఆంటోని తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో చదలవాడ పద్మావతి విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏ సినిమా అయినా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు. కానీ తెలుగులో బిచ్చగాడు సినిమా 100 పూర్తి చేసుకుంది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఇదే సినిమా బుల్లితెరపై కూడా హల్చల్ చేస్తుంది. గత వారం టెలికాస్ట్ అయిన ఈ చిత్రం 19.4 టీఆర్పీ రేటింగ్ సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం విజయ్ ఆంటోని 'బేతాళుడు' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







