'సీక్రెట్ కన్వర్జేషన్' ఫీచర్‌ను అందుబాటులోకి ...
- October 07, 2016
ఆర్థిక లావాదేవీల వివరాలను, వ్యక్తిగత అంశాలను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతోనే పంచుకుంటాం. కానీ.. సోషల్‌మీడియా సైట్లలో ఛాటింగ్ ద్వారా అలాంటి విషయాలను పంచుకోవడం ఏమాత్రం మంచిది కాదన్నది నిపుణుల సూచన. ఎందుకంటే.. మనకు తెలియకుండానే హ్యాకర్లు, గూఢచార సంస్థలు మన విలువైన సమాచారాన్ని దొంగలించే అవకాశం చాలా ఎక్కువ. ఇక నుంచి ఆ భయం అక్కర్లేదంటోంది ఫేస్బుక్. అందుకోసం మెసెంజర్ యాప్‌లో 'సీక్రెట్ కన్వర్జేషన్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
స్నాప్‌చాట్.. వాట్సాప్.. వైబర్ తీసుకొచ్చిన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం ఇప్పుడు ఫేస్బుక్ మెసెంజర్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు మూడో వ్యక్తికి అర్థమయ్యే పరిస్థితి ఉండదు. వాటిని ఫేస్బుక్ యాజమాన్యానికి.. ప్రభుత్వ నిఘా సంస్థలు కూడా అర్థం చేసుకునే వీలుండదట.
అలాగే 'సీక్రెట్ కన్వర్జేషన్' ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే మనం పంపిన మెసేజ్‌లు మనం ఎంచుకున్న కాల వ్యవధిలో డిలీట్ అయిపోతాయి. అది ఎంత సమయంలో అంటే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజుల్లోగా డిలీట్ అయ్యేట్లు సెట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం తాజాగా విడుదలైన గూగుల్ 'అల్లో' యాప్‌లోనూ ఉంది. మరో విశేషమేమిటంటే.. ఒక డివైజ్ నుంచి పంపిన మెసేజ్‌లను మరో డివైజ్‌లో లాగిన్ అయ్యి చూసుకునే వీలుండదు. ఉదాహరణకు.. స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా జరిపిన సంభాషణలు డెస్క్‌టాప్ కంప్యూటర్లో లాగిన్ అయ్యి చూస్తే కనిపించవు.ఆండ్రాయిడ్.. ఐఓఎస్ వెర్షన్లో మెసెంజర్ యాప్‌ను అప్డేట్ చేసుకుంటే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఫేస్బుక్ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







