బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లోంచి గట్టెక్కిన వలసదారుడు
- October 07, 2016
మనామా: ఉద్యోగం కోల్పోయి, రోడ్లపై బిచ్చమెచ్చుకుంటూ దయనీయ స్థితుల్లో జీవితం వెల్లదీస్తున్న వ్యక్తిని స్వదేశానికి పంపించారు. పలువురు కార్మికులు, ఇండియన్ ఎంబసీ సహాయంతో రాసిక్ కుమార్ ఛగన్‌లాల్ పాంచాల్ అనే వ్యక్తి బహ్రెయిన్ నుంచి ఇండియాకి వెళ్ళగలిగాడు. ఈ సందర్భంగా తనకు సహకరించినవారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు పాంచాల్. యూఏఈలో కొన్నేళ్ళపాటు పనిచేసిన పాంచాల్, 2006లో బహ్రెయిన్ చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళు పెయింటింగ్ సూపర్ వైజర్‌గా జీవితం బాగానే ఉన్నా, ఉద్యోగం పోయాక, పరిస్థితులు మారిపోయాయి. అప్పులు పెరిగిపోవడం, ట్రావెల్ బ్యాన్ వంటి విషయాలతో చితికిపోయాడు పాంచాల్. బిచ్చమెత్తుకుంటూ 20 బహ్రెయినీ దినార్స్ అద్దెను చెల్లించి షెల్టర్ పొందానని, ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేనని పాంచాల్ చెప్పాడు. చాలాకాలం తర్వాత తన కుటుంబ సభ్యుల్ని కలుసుకోబోతున్నాననీ, మళ్ళీ తాను ప్రాణాలతో ఇండియాకి వెళతానని అనుకోలేదని వెళుతూ వెళుతూ కన్నీరుమున్నీరయ్యాడు పాంచాల్.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









