తెలుగు భాషపై ముచ్చట పడిన విద్యాబాలన్
- October 07, 2016
తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే విద్యాబాలన్ తెలుగు భాషపై ముచ్చటపడింది. తెలుగు తెరపై విద్య కనిపించాలని ఆరాటపడే టాలీవుడ్ ప్రేక్షకులు ఈ కబురు విని సంబరపడ్డారు. అయితే ఆమె తెలుగు నేర్చుకుంటున్నది తెలుగు సినిమాల్లో నటించేందుకు కాదు. కేంద్ర పట్టు బోర్డు తరఫున చీరలు ప్రచారం చేసేందుకు. విద్యాబాలన్ మొత్తం తొమ్మిది భాషల్లో ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.
సంప్రదాయ వస్త్రాలకు ప్రాముఖ్యతనిస్తూ నిండుగా కట్టు, బొట్టుతో ఆకట్టుకోవడం విద్యాబాలన్ ప్రత్యేకత. చీర కట్టుకు కొత్త అర్థం, కట్టులో ఉన్న అందం.. నేటి తరానికి చెప్పిన నటి విద్యాబాలన్. ఆమెకు చీరమీద ఉన్న ఇష్టమే ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా అడుగులు వేస్తున్న విద్య...ఇటీవలే కేంద్ర పట్టుపరిశ్రమకు ప్రచారకర్తగా ఎంపిక అయ్యారు. ఇందులో భాగంగా 9 భాషల్లో ఈ ప్రకటన రూపొందనుంది. అందుకే ఆయా భాషలు నేర్చుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే తమిళం, మలయాళం, బెంగాలి కొద్దిగా మాట్లాడతారు.
హిందీ, మరాఠీలో ఆమె చక్కగా మాట్లాడగలరు. ఇక తెలుగు, కన్నడ, అస్సామీ, గుజరాత్ భాషలను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







