టాప్‌ 5 షాపింగ్‌ సిటీస్‌లో దుబాయ్‌కి చోటు

- October 07, 2016 , by Maagulf
టాప్‌ 5 షాపింగ్‌ సిటీస్‌లో దుబాయ్‌కి చోటు

ప్రపంచంలోనే మోస్ట్‌ కాస్మోపాలిటన్‌ సిటీగా, మిడిల్‌ ఈస్ట్‌ ట్రావెలర్స్‌కి టాప్‌ డెస్టినేషన్స్‌లో ఒకటిగా ఇప్పటికే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న దుబాయ్‌, 'బెస్ట్‌ షాపింగ్‌ సిటీస్‌' కేటగిరీలో ప్రంచంలోనే టాప్‌ 5 లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. కోండె నాస్ట్‌ ట్రావెలర్‌ (సిఎన్‌టి) అనే ట్రావెల్‌ వెబ్‌సైట్‌ నిర్వహించిన రీడర్స్‌ సర్వేలో, దుబాయ్‌ టాప్‌ 3లో కూడా చోటు దక్కించుకుంది. తొలి స్థానంలో న్యూయార్క్‌ నిలిచింది. న్యూయార్క్‌ అంటే షాపింగ్‌ డెస్టినేషన్‌ అని ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే న్యూయార్క్‌ తన ప్రత్యేకతను చాటుకుంది. రెండో స్థానంలో దుబాయ్‌ చోటు దక్కించుకుంది. మాల్‌ ఆఫ్‌ ఎమిరేట్స్‌ వంటివి ట్రావెలర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దుబాయ్‌లో షాపింగ్‌ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. మూడో స్థానం చికాగోకి దక్కింది. టాప్‌ 5లో మిగతా నగరాల్లో హాంగ్‌ కాంగ్‌, సాంటా ఫె ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com