మహా బతుకమ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

- October 07, 2016 , by Maagulf
మహా బతుకమ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

అస్థిత్వం.. ఆత్మగౌరవం కోసం సాధించు కున్న ప్రత్యేక రాష్ట్రంలో సంస్కృతిని చాటేందుకు సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపు తోం ది. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ వేడు కలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ రికార్డు నెలకొల్పడం.. విదేశీ పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా మహా బతుక మ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎల్‌బీ స్టేడియంలో శనివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు రికార్డు స్థాయిలో దాదాపు 15 వేల మంది మహిళలు బతుకమ్మ ఆడనున్నారు. మధ్యలో పెట్టనున్న 20 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. జీహెచ్‌ఎంసీ, సాంస్కృతిక, రాష్ట్ర పౌర సంబంధాల సమాచార శాఖలు కలిసి ఏర్పాట్లు చేస్తు న్నాయి.

బల్దియా 10 వేల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులను సమీకరిస్తుండగా.. ఇతర విభాగా లు మరో 5 వేల మందిని తీసుకురానున్నా యి. దాదాపు 50 వేల మంది ప్రత్యక్షంగా వేడుకలను వీక్షిస్తారని అంచ నా. ఈ సారి బతుకమ్మ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. అందరూ ఒకేలా ఆడేందుకు రిహార్సల్స్‌ చేయించారు. సర్కిల్‌, డివి జన్ల వారీగా మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతిని ధులు సభ్యులకు ఎలా ఆడాలనే దానిపై రెండు, మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. వేడుకలకు వేదికై న ఎల్‌బీ స్టేడియం భిన్నరంగుల విద్యుత దీపా లతో కాంతులీనుతోంది. మహిళలు మధ్యాహ్నం 3 గంటలకే స్టేడియానికి రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు 5200 మందితో నిర్వహించిన ఓనం ఉత్సవం గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రత్యే కమైన ఈ పండుగకు ఆ ప్రదర్శన అనంతరం ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది. సంప్రదాయ వస్త్రధారణతో కేరళ యువతు లు చేసే నృత్యాలు.. సందడి విశేషంగా ఆకట్టుకుం టుంది. ఆ రికార్డులను బద్దలు కొట్టేలా ఏకంగా 15 వేల మందితో మహా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సాంస్కృతిక సారఽథి ఆధ్వర్యంలో వారం రోజులుగా రిహార్సల్స్‌ కూడా జరుగుతున్నాయి. గతానికి భిన్నంగా అందరూ ఒకే రకంగా ఆడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంప్ర దా యాన్ని చాటుతూ.. బతుకునివ్వమ్మా అంటూ ప్రకృతి దేవత ను కొలిచే వేడుకలను ఘనంగా నిర్వహించి ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వేడుకల తో విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనేది అసలు ఉద్దేశం. పరిశీలించిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌... 
ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌, కలె క్టర్‌ రాహుల్‌ బొజ్జా, పర్యాటక కార్పొరేషన్‌ ఎండీ క్రిష్టినా తదితరులు పరిశీలించారు. బతుకమ్మ ఆడేందుకు వచ్చే మహిళలు, వీక్షకులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సంద ర్భంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ మాట్లాడుతూ నగరం లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బతు కమ్మ వేడుకను విశ్వవ్యాప్తం చేయాలని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తు న్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com