కార్న్ మంచూరియా
- August 15, 2015
కావలిసిన పదార్ధాలు
బేబీ కార్న్ - పదిహేను
అల్లం తరుగు - చెంచా
వెల్లుల్లి తరుగు - చెంచా
కొత్తిమీర తరుగు - చెంచా
చక్కెర - కొద్దిగా
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - తగినంత
క్యాప్సికమ్ - ఒకటి
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చిమిర్చి - రెండు
సోయా సాస్ - చెంచా
వెనిగర్ - అర చెంచా
మిరియాల పొడి - కొద్దిగా
పిండి కోసం :
మైదాపిండి - 3 స్పూన్లు
జొన్నపిండి - 3 స్పూన్లు
తయారీ విధానం
ముందుగా మైదా పిండిని, మొక్క జొన్న పిండిని, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసుకుని కార్న్ ముంచేందుకు వీలుగా పిండిలా కలుపుకోవాలి. బేబీ కార్న్‌ని రెండు ముక్కలుగా కోయాలి. ఒక్కోదాన్ని పిండిలో ముంచి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బాణలిలో ఒక చెంచా నూనె పోసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్ వేసి వేయించాలి. తరువాత సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, చక్కెరా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టాలి. సిమ్‌లో ఉంచాలి. ఐదు నిముషాల తరువాత వేయించిన బేబీ కార్న్, కొత్తిమీరా వేసి పైన వెనిగర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









