జెరూసలేంలో 13మంది మహిళా కార్యకర్తల అరెస్టు
- October 08, 2016
దిగ్బంధనానికి గురైన గాజా ప్రాంతానికి సాయం తీసుకెళుతున్న ఓడను అంతర్జాతీయ జలాల్లో హైజాక్ చేసిన ఇజ్రాయిలీ నావికాదళం అందులోని 13మంది మహిళా శాంతి కార్యకర్తలను అరెస్టు చేసింది. గాజా నుండి 40మైళ్ళ దూరంలోని అషదద్ పోర్టులో వున్న డచ్ ఓడను ఇజ్రాయిల్ బలగాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. అందులో వున మహిళలను విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సైన్యం తెలిపింది. 11మంది ప్రయాణికులను కూడా దాదాపు 96గంటల పాటు నిర్బంధించామని ఇజ్రాయిల్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సాబిన్ హద్దద్ తెలిపారు. ఈలోగా వారిని ఇజ్రాయిల్ వీడి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చామని, కానీ వారు తిరస్కరించారని చెప్పారు.ఇద్దరు మహిళా జర్నలిస్టులు మాత్రం వెంటనే వెళ్ళిపోయారని చెప్పారు. ఓడలోని ప్రయాణికులను, సిబ్బందిని తక్షణమే విడిపించాలంటూ డెమోక్రటిక్, గ్రీన్స్ పార్లమెంటరీ గ్రూపులు ఇయుకి ఒక లేఖ రాశాయి. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఏకపక్షంగా, అక్రమంగా వ్యవహరించిందని వారు విమర్శించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







