అరబ్ కంట్రీ నాకు "మినీ ఇండియా"
- August 16, 2015
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా ఇవాళ యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కి చేరుకున్నారు. యూఏఈలో ప్రధాని పర్యటన రెండు రోజులపాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా యూఏఈ రాజు షేక్ మహ్మద్‌బిన్ జయీద్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.
యూఏఈ వెళ్లిన సందర్భంగా షార్జాకు చెందిన ఖాలిజ్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అరబ్ దేశాలు భారత్ కు ఎప్పుడూ ముఖ్యమైనవేనని అన్నారు. చాలా సంవత్సరాల తరువాత ఒక భారత ప్రధాని అరబ్ దేశాల పర్యటనకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. అరబ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాల్లో 26 లక్షల మంది భారతీయులు ఉంటున్నారని, అందుకే గల్ఫ్ దేశం తనకు మినీ ఇండియాలా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ కు రక్షణ, ఆర్థికాభివృద్ధిలో గల్ఫ్ పాత్ర మరువలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







