పాక్‌లో ఆత్మాహుతి దాడి పంజాబ్ హోంమంత్రి సహా 9 మంది మృతి

- August 16, 2015 , by Maagulf
పాక్‌లో ఆత్మాహుతి దాడి పంజాబ్ హోంమంత్రి సహా 9 మంది మృతి

ఇస్లామాబాద్,  పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో పంజాబ్ హోంమంత్రి సుజా ఖాన్‌జాదా సహా 9 మంది చనిపోయారు. అటోక్ జిల్లా షాదిఖియి గ్రామంలో సుజా నివాసంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. పేలుడులో పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడులో డిఎస్పీ షౌకత్ షా కూడా చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖాన్‌జాదా నివాసంలో సమావేశం జరుగుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరగడంతో మ‌ృతుల సంఖ్య పెరిగింది. పాముకు పాలు పోసి పెంచినట్లు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిన పాకిస్థాన్ చివరకు పాము కాటుకే బలౌతోంది. అయినా పాక్ పాలకుల్లో మార్పు మాత్రం రావడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com