కంటెంట్ ఈజ్ కింగ్ అంటున్న రాజ్ కందుకూరి

- October 08, 2016 , by Maagulf
కంటెంట్ ఈజ్ కింగ్ అంటున్న రాజ్ కందుకూరి

''సినిమాకు హీరో, బడ్జెట్ ముఖ్యమే. కంటెంట్ కూడా చాలా ముఖ్యం. అది కింగ్ లాంటిది. మంచి కథ, ఆ కథకు సూటయ్యే హీరో సినిమా చేస్తే విజయం సాధించ వచ్చు'' అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. 'పెళ్లి చూపులు'తో ఘనవిజయం అందుకున్నారీయన. ఆ సినిమా 20 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని ఆయన తెలిపారు. ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో 'సైన్మా', విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా ప్లానింగ్‌లో ఉన్నాయన్నారు.

నేడు పుట్టినరోజు సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''9 ఏళ్లలో పది సినిమాలు తీశా. 'పెళ్లి చూపులు' ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఒకట్రెండు కోట్ల బడ్జెట్‌లో కొత్త వాళ్లతో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com