చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు క్యారెట్, పన్నీర్, చందనం పొడి ప్యాక్
- October 08, 2016
మహిళలూ మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనం పొడి చేర్చి ముఖానికి బగా అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటల తరబడి మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది. చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు ఎండబెట్టిన 50 గ్రాముల క్యారెట్ తురుముకు అంతే సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే రోజులో కనీసం నాలుగైదుసార్లు చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటే జిడ్డు సమస్య కొంతవరకు తగ్గుతుంది. జిడ్డు సమస్య ఉన్నవాళ్లు జెల్ ఆధారిత సన్‌స్క్రీన్‌ను ఎంచుకుంటే కొంత మార్పు ఉంటుంది. బాదంపప్పు, గ్లిజరిన్ సుగుణాలున్న సబ్బుల్ని వాడాలి. వారానికి రెండుసార్లు బత్తాయి, దోస, కీరదోస వంటి వాటితో ముఖాన్ని రుద్దుకోవాలి. దీనివల్ల చర్మంలోని నూనెశాతం అదుపులోకి వచ్చేస్తుంది. ఇక, పెదవులు పొడిబారి ఉంటే మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌లను ఎంచుకోవాలి. కొందరి పెదవులు సహజంగా ఉంటాయి. అలాంటి వారు డ్రైలిప్‌స్టిక్స్ వేసుకుంటే సరిపోతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







